సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) చీఫ్ కమిషనర్ గా వజ్జా నియామకం
– కమిషనర్లుగా మరో నలుగురుని నియమించిన ప్రభుత్వం

అక్షర ఉదయమ్ – అమరావతి
ఏపీ సమాచార కమిషన్ కు చీఫ్ కమిషనర్ సహా నలుగురు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
వజ్జా శ్రీనివాసరావు – చీఫ్ కమిషనర్
వట్టికూటి శరత్ చంద్ర కల్యాణ చక్రవర్తి – కమిషనర్
గాజుల ఆదెన్న – కమిషనర్
ఒంటేరు రవిబాబు – కమిషనర్
పరవాడ సింహాచలం నాయుడు – కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల సర్వీస్ లేకుంటే 65 ఏళ్లు వచ్చే వరకు ఆర్టీఐ కమిషనర్లుగా పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.




