పోలీసుల పై అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం : పిడుగురాళ్ళ సిఐ వెంకట్రావు హెచ్చరిక

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక పురస్కరించుకుని ఆయా పార్టీల నాయకులు తమ తమ రాజకీయం కోసం పోలీసులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని పిడుగురాళ్ళ పట్టణ సిఐ వెంకట్రావు హెచ్చరించారు. పిడుగురాళ్ళ పట్టణ పోలీసు స్టేషన్లో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పోలీసులకు సంబంధం లేదని అన్నారు. కావాలని కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.