మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా “శక్తి బృందాల” గస్తీ
- రద్దీ ప్రదేశాలలో ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్న శక్తి బృందాలు
- మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు శక్తి వాట్సాప్ నెంబర్ “79934 85111”

మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా శక్తి బృందాలు ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తున్నారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని మహిళలకు రక్షణగా ఉండేందుకు సిఐ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి సబ్ డివిజన్ పరిధిలో శక్తి బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.

జిల్లాలో మొత్తం నాలుగు శక్తి బృందాలు విధులు నిర్వహిస్తున్నాయి. ఎస్పీ ఆదేశాలతో బుధవారం శక్తి బృందాలు రద్దీ ప్రదేశాలలో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తూ మహిళల భద్రత, రక్షణ కొరకు అందుబాటులోకి తీసుకువచ్చిన శక్తి యాప్ ఆవశ్యకత, దాని ద్వారా అందించే సేవలు, నిక్షిప్తం చెయ్యబడిన సమాచారం, రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం తదితర విషయాల గురించి మహిళలకు, విద్యార్థులకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.

మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ సాంకేతికత సహాయంతో మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారు నూతనంగా ప్రారంభించిన శక్తి వాట్సాప్ నెంబర్ 79934 85111 గురించి అవగాహన కల్పించారు.

ఆపదలో ఉన్న మహిళలు శక్తి వాట్సప్ నెంబరుకు వీడియో కాల్ లేదా నార్మల్ కాల్ లేదా మేసేజ్ చేసినా సంబంధిత కమాండ్ కంట్రోల్ రూమ్ కు సంకేతాలు వెళతాయని, వెంటనే శక్తి బృందాలు స్పందించి ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడం జరుగుతుందని, ఈ నెంబర్ 24/7 అందుబాటులో ఉంటుందని తెలిపారు.
శక్తి యాప్ డౌన్లోడ్ చేయండి: https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha
అక్షర ఉదయమ్ – బాపట్ల
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..