1% లేబర్ సెస్ వసూలు చేయాలి: కలెక్టర్ వెంకట మురళి

 

ప్రభుత్వ, ప్రైవేటు భవన నిర్మాణ దారుల నుండి 1% లేబర్ సెస్ వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కార్మికుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1996 ప్రకారం 1% లేబర్ సెస్ వసూలు చేయాలని ఆయన అన్నారు.