ఖో ఖో క్రీడా కారుడు శివారెడ్డిని అభినందించిన క్రీడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి

అక్షర ఉదయమ్ – విజయవాడ

 

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి ఖో ఖో పోటీల్లో భారతదేశం తరపున ఆడి దేశానికి విజయం సాధించి పెట్టిన బెస్ట్ అటాకర్ శివారెడ్డిని రాష్ట్ర క్రీడ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందించారు. గురువారం విజయవాడలో మంత్రి క్యాంప్ ఆఫీసులో శివారెడ్డి మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శివారెడ్డి మంత్రితో మాట్లాడుతూ తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం కావాలని కోరారు. సహకారం అందిస్తే తాను మారేనో పతకాలను సాదించగలను అని తెలిపారు.