పిడుగురాళ్ళ మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ సహా టిడిపి తీర్థం పుచ్చుకున్న 17 మంది కౌన్సిలర్లు – పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని

పట్టణ అభివృద్ధికి కలిసి ముందుకు వెళ్దామన్న ఎమ్మెల్యే యరపతినేని

 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ ఎవ్వరూ ఊహించని విధంగా జెండా ఎగుర వేసింది. రెండు సార్లు వాయిదా పడిన పిడుగురాళ్ళ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అభివృద్ధి నినాదంతో వైఎస్సార్ సీపీకి షాక్ ఇచ్చారు. వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం పిడుగురాళ్ళ మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లు గురజాల ఎమ్మెల్యే యరపతినేని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నిక వరకు వైఎస్సార్ సీపీ ఖాతాలో ఉన్న పిడుగురాళ్ళ మున్సిపాలిటీ ఇప్పుడు టిడిపి వశం అయింది.

పిడుగురాళ్ళ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ సహా 17 మంది కౌన్సిలర్లకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే తన దృష్టి ఉంటుంది అని అన్నారు. అందరం కలిసి పిడుగురాళ్ళ పట్టణ అభివృద్ధికి కలిసి ముందుకు సాగుదామని ఎమ్మెల్యే యరపతినేని స్పష్టం చేశారు. నాలుగు మాసాల్లో మున్సిపల్ కార్యాలయం పూర్తి చేస్తామని చెప్పారు.

ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్ సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో మున్సిపల్ చైర్మన్ కొత్త చిన్న సుబ్బారావు, వైస్ చైర్మన్ వున్నం భారతి, కొత్త పుష్పలత, కొత్త తులసి, జోగిపర్తి సుజాత, నంద్యాల ఆంజనేయులు, బడిగుంచల నాగమణి, అజ్మీర శారద, కుక్కమూడి మేరీ కుమారి, పసుపులేటి ఆనందబాబు, గర్రె నాగేశ్వరరావు, తురకా ముక్కంటి, షేక్ సైదావలి, ఉప్పు దేవి, షేక్ సైదాబీ, నాగోతు పద్మావతి, పోలు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.