ఏపీలో తొలి జిబియస్ మరణం

అక్షర ఉదయమ్ – గుంటూరు

దేశాన్ని ఇటీవల జీబీఎస్ వైరస్ కలవర పెడుతోంది. ఈ క్రమంలో ఏపీలో తొలి గులియన్ బాగ్ సిండ్రోమ్ (GBS) మరణం నమోదైంది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జీబీఎస్ కారణంగా మరణించించిన వారి సంఖ్య 2కి పెరిగింది. ఇటీవల తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన మహిళ జీబీఎస్ కారణంగా చనిపోయిన విషయం తెలిసిందే.