కిక్ బాక్సింగ్ విజేతను అభినందించిన మంత్రి సుభాష్

అక్షర ఉదయమ్ – రామచంద్రపురం

 

అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో మూడు పతకాలు సాధించిన నిహారికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శనివారం అభినందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రామచంద్రపురం పట్టణానికి చెందిన కారుమూరి నిహారిక అత్యంత ప్రతిభ చూపించారు. ప్రథమ స్థానంలో రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం సాధించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ ను ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు నిహారిక.