
అక్షర ఉదయమ్ – మచిలీపట్నం
బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే. బాలాజీ పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సరిహద్దు జిల్లాల నుండి వచ్చే కోళ్లు, మాంసం, గుడ్ల పై గట్టి నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. అన్ని చెక్ పోస్ట్ ల వద్ద కోళ్లు, గుడ్ల రవాణా వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు.