సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

అక్షర ఉదయమ్ – మాచవరం

 

మాచవరం మండలం మల్లవోలు గ్రామంలో ఉగ్ర నరసింహ స్వామి దేవస్థానం వరకు నిర్మాణం చేపట్టబోతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవస్థానం వరకు రోడ్డు అద్వానంగా ఉందని ప్రత్యేక నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.