మాట మీద నిలబడతారా..? రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? : ప్రత్యర్థికి యరపతినేని సూటి ప్రశ్న

📰 Generate e-Paper Clip

– మాట మీద నిలబడే వారి ప్రశ్నలకు

సమాధానం చెబుతానన్న యరపతినేని

 

 అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ 

 

మాట మీద నిలబడతారా..? రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అంటూ గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తన ప్రత్యర్థి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి సూటి ప్రశ్న సంధించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ యరపతినేని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తమ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగాయని అన్నారు. ఆ సమయంలో ఎన్నికల్లో తాను ఓడిపోయిన పక్షంలో తాను.. కాసు మహేష్ రెడ్డి ఓడిపోయిన పక్షంలో ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ విసురు కోవడం అందరికీ తెలిసిందే అని చెప్పారు.

మరి కాసు మహేష్ రెడ్డి “మాట మీద నిలబడతారా..? రాజకీయ సన్యాసం తీసుకుంటారా..? అంటూ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీడియా ముఖంగా సూటిగా ప్రశ్నించారు. మాట మీద నిలబడితే ఆయన ప్రశ్నలపై తాను స్పందిస్తానని, మాట మీద నిలబడని వారికి తమ కార్యకర్తలు సమాధానం ఇస్తారని ఎమ్మెల్యే యరపతినేని స్పష్టం చేశారు.