ఆపరేషన్ సింధూర్ లో ఇప్పటివరకు జరిగిన టాప్ 10 పరిణామాలు
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దూకుడుగా ముందుకు వెళుతోంది. తాజాగా పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత యుద్దవిమానాలు ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసాయి.

ఆపరేషన్ సింధూర్ టాప్ 10 పరిణామాలు:
- ఆపరేషన్ సింధూర్లో వైమానిక దళం, సైన్యం, నౌకాదళం కలిసి పనిచేశాయి.
- డ్రోన్లు, రాఫెల్ యుద్ధ విమానాలతో పాకిస్థాన్ భూభాగంపై దాడులు జరిపారు.
- భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ సిందూర్ ను పర్యవేక్షించారు.
- పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి విజయవంతమైందని సైన్యం ప్రకటించింది.
- మురీద్కేలో లష్కర్-ఎ-తోయిబా స్థావరం పూర్తిగా ధ్వంసమయ్యింది.
- బహవల్పూర్లో జైష్-ఎ-మొహమ్మద్ స్థావరం ధ్వంసం.
- అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ, రష్యా వంటి దేశాలకు భారత్ సమాచారం అందించింది.
- దాడుల తర్వాత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అమెరికా ఎన్ఎస్ఏ, విదేశాంగ మంత్రితో మాట్లాడారు.
- పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ భారత్ దాడిని ఖండించారు.
- శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల విమానాశ్రయాల నుంచి విమాన సర్వీసులు రద్దు.

పాక్ ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ప్రకారం, కోట్లీ, మురీద్కే, బహావల్పూర్, ముజాఫ్ఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మురీద్కేలో లష్కర్-ఎ-తయిబా ప్రధాన కేంద్రం ఉంది, ఇది హఫీజ్ సయీద్ నిర్వహిస్తున్న సంస్థ. బహావల్పూర్లో మసూద్ అజహర్ ఆధ్వర్యంలోని జైషే మహమ్మద్ కు బేస్ ఉంది.

భారత దాడుల లక్ష్యం ఉగ్రవాద నిర్మూలన మాత్రమే. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం తలెత్తిందని స్పష్టం చేసింది.
– అక్షర ఉదయమ్ న్యూస్