“మహానాడు“లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రసంగం హైలైట్స్..
– ”మహానాడు” అంటే నాటి నుంచి నేటి వరకు ప్రతి పక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా..
– అదే జోరు.. అదే హోరు.
– దేవుని గడపలో జరిగే మహానాడు చరిత్ర సృష్టించ బోతోంది.. ఈ మహానాడు దశ, దిశ నిర్దేశిస్తుందని గట్టిగా చెబుతున్నా.
– కడప జిల్లాలో 10 స్థానాలకు 7 గెలిచి సత్తా చాటాం.. వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం కష్ట పడితే 10/10 స్వీప్ చేస్తాం.
– 2024 ఎన్నికల్లో 57 శాతం ఓట్లు సాధించాం.. టీడీపీకి ఘన విజయం అందించిన తెలుగుదేశం కార్యకర్తలకు కృతజ్ఞతలు.
– కార్యకర్తల పోరాటాలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.. పీక కోస్తుంటే కూడా జై టీడీపీ అని చంద్రయ్య ప్రాణాలు వదిలేశారు, చంద్రయ్య వంటి వారి స్ఫూర్తి టీడీపీని నడిపిస్తోంది.. పసుపు సింహం తోట చంద్రయ్య.
– కార్యకర్తల త్యాగాలకు శిరస్సు వంచి సమస్కరిస్తున్నా.. త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం.
– దేశంలో ఏ పార్టీ ఎదుర్కోని సంక్షోభాలు ఎదుర్కొన్నాం.. టీడీపీ పని అయి పోయిందని మాట్లాడిన వాళ్ల పని అయిపోయింది.. టీడీపీ జెండా ఎప్పటికీ రెపరెప లాడుతునే ఉంటుంది.
– తెలుగు జాతి అభివృద్ధి కోసమే టీడీపీ పని చేస్తుంది.. తెలుగు వారి అభివృద్ధికి టీడీపీ బ్రాండ్ అంబాసిడర్.
– పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రాజ్యాధికారం.. రూ.2కి కిలో బియ్యం, సబ్సిడీ కరెంట్ తెలుగుదేశం తెచ్చినవే.
– టీడీపీ కార్యకర్తలే నా ఆయుధాలు.. కార్యకర్తలతో కలిసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తాం.
– రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే.
– గతాన్ని స్మరిస్తూ.. భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ.. తెలుగు ప్రజల ఆశయాలను చాటే ఉద్యమానికి వేదిక మహానాడు 2025.
– ఈ మహానాడు – 2025 చరిత్రలో నిలిచి పోతుంది.
– మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అక్షర ఉదయమ్ – కడప
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..