వరికపూడిశెల ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి : మంత్రి నిమ్మల రామానాయుడు

📰 Generate e-Paper Clip

వరికపూడిశెల ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలి

 

  • మంత్రి నిమ్మల రామానాయుడు

 

లక్ష్మణరావు మల్లెంశెట్టి

అక్షర ఉదయమ్ ఎడిటర్ 

 

పల్నాడు జిల్లాలోని ప్రతిష్టాత్మక వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పురోగతిపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.

 

  • ముఖ్యమైన నిర్ణయాలు

 

ప్రాజెక్టు భూ సేకరణ కోసం కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.63.14 కోట్లు మంజూరు చేసింది. పైప్‌లైన్ నెట్‌వర్క్ పనుల కోసం భూసేకరణను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు.

 

  • అక్టోబర్ 31 నాటికి డీపీఆర్

 

84,500 ఎకరాలకు సాగు నీరు అందించేలా అక్టోబర్ 31 నాటికి డీపీఆర్, పబ్లిక్ హియరింగ్ పూర్తి చేయాలని నిర్ణయించారు.

 

  • పర్యావరణ అనుమతులు

 

కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరితగతిన పర్యావరణ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు.

పల్నాడు ప్రాంత రైతులకు సాగు నీరు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తుందని మంత్రి రామానాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి స్పష్టం చేశారు.