గాంధీజీ చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలి – పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

– పిడుగురాళ్ళలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి 

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

 

జాతిపిత మహాత్మా గాంధీజీ చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని పల్నాడు హాస్పిటల్స్ అధినేత, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ వైఎస్సార్ సీపీ, మహాత్మా గాంధీ కాంస్య విగ్రహ కమిటీ పిడుగురాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఉదయం పిడుగురాళ్ళ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్నాడు హాస్పిటల్స్ అధినేత, చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మహాత్మా గాంధీ కాంస్య విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ ప్రసంగిస్తూ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన మహా నాయకుడు, మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.  జాతిపిత మహాత్మా గాంధీ చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు చింతా వెంకట రామారావు, గాంధీజీ కాంస్య విగ్రహ కమిటీ అధ్యక్షులు జూలకంటి శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి ఆనంద్, పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి ఆలేటి కనకయ్య, ఆర్యవైశ్య నాయకులు కోటా బుచ్చిబాబు, గోపవరపు హనుమంతరావు, కండె లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ పంతంగి అమర్ తదితరులు పాల్గొన్నారు.