అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్వాతంత్రం సమరంలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారికి నివాళిగా జాతీయ అమర వీరుల దినోత్సవం జరుగుతుందని, అదే రోజున కోవిడ్ పేషెంట్స్ కు వైద్య సేవలు అందిస్తూ 2 వేల మంది ఐ.ఎం.ఏ వైద్యులు, 2500 మంది నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, వెయ్యి మంది పోలీసులు, వంద మంది కేంద్రీయ రిజర్వు పోలీసులు ప్రాణ త్యాగం చేశారని పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులుధూళిపాళ్ళ భరత్ కుమార్ అన్నారు. వారందరికీ పిడుగురాళ్ళ ఐ.ఎం.ఏ శాఖ సభ్యులు వారి వారి ఆసుపత్రుల్లో గురువారం రాత్రి 7- 8 గంటల మధ్యలో దీపాలు వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొవిడ్ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎం.ఏ. పిడుగురాళ్ళ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు ధూళిపాళ్ళ భరత్ కుమార్, బొర్రా రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.