యథాతథంగా ఇంటర్‌ మొదటి ఏడాది పబ్లిక్‌ పరీక్షలు

అక్షర ఉదయమ్ – విజయవాడ:

ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంటర్మీడియట్‌ విద్యలో ప్రతిపాదిత సంస్కరణలపై వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ అమలు, పరీక్షల నిర్వహణ, అంతర్గత మార్కుల విధానం లాంటి పలు ప్రతిపాదనలను ఇటీవల ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రకటించింది. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 26 వరకు సలహాలు, సూచనలు స్వీకరించింది.