తెనాలి హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు

 

అక్షర ఉదయమ్ – తెనాలి

గుంటూరు జిల్లా తెనాలిలో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి పై హత్యాయత్నం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. నాజరుపేటకు చెందిన గొంది బసవయ్య వద్ద అంగలకుదురుకు చెందిన అనిల్ ఆటోలు అద్దెకు తీసుకుంటున్నాడు. అనిల్ తో పాటు ఇస్లాంపేటకు చెందిన జూపల్లి వేణు, స్నేహితుడు రాము గత నెల 31న మద్యం తాగడానికి బసవయయ్యను డబ్బు అడగ్గా ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో వేణు బసవయ్య గొంతుపై పొడిచాడు. వేణును వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.