ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జాయింట్ కలెక్టర్ మాధవన్

అక్షర ఉదయమ్ – బొండపల్లి

 

జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గురువారం బొండపల్లి మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా బొండపల్లి సమీపంలోని గ్యాస్ ఆఫీస్, సివిల్ సప్లై గోడౌన్, ఎం డి ఎం వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ప్రజా పంపిణీ వ్యవస్థల నిర్వహణ పరిశీలించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.