ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
– 21 అంశాలపై చర్చ

 


అక్షర ఉదయమ్ – అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు కేబినెట్‌తో చర్చించారు. ఈ భేటీలో 21 అంశాలపై మంత్రి మండలిలో మాట్లాడ నున్నారు. ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్నికల్‌ హబ్స్‌ (లిఫ్ట్) పాలసీ 2024 నుంచి 2029 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

జల వనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. కారవాన్‌ పర్యాటకానికి ఆమోదం తెలపనుంది. అమృత్‌ పథకం 2.0 పనులకు ఆమోదం తెలపనుంది మంత్రి వర్గం. అమరావతిలో వివిధ పనుల వేగ వంతానికి స్పెషల్‌ పర్పజ్‌ వెహికల్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది కేబినెట్.

అమరావతితో సహా ఏపీ వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఓకే చెప్పనుంది. కుష్టు వ్యాధి పదం తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనను ఆమోదించనుంది. విద్యుత్‌ శాఖకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కార్మిక చట్టాల్లో పలు సవరణల ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది.