పద్దెనిమిది ఏళ్ళు పైబడిన మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
– త్వరలోనే మరో పథకం అమలుకు శ్రీకారం
– వారి ఖాతాలో రూ.18,000

అక్షర ఉదయమ్ – అమరావతి
త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాలో రూ.18 వేలు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది. అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం 2024 – 2025 బడ్జెట్‌లో రూ.3,341.82 కోట్లు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో బీసీ మహిళలకు రూ.1069.78 కోట్లు కేటాయించగా, మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుక బడిన వర్గాలకు చెందిన మహిళల కోసం రూ.629.37 కోట్లు, అలానే మైనారిటీ ఆడబిడ్డలకు రూ.83.79 కోట్లు, మిగతా మొత్తంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అధికారిక వెబ్‌సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..