పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అక్షర ఉదయమ్ – అమరావతి

ఏడాది పాలనపై 12వ తేదీన నియోజక వర్గాల్లో విజయోత్సవ ర్యాలీలకు నిర్ణయం.

ఈనెల 12న సాయంత్రం ఎన్డీయే పక్షాలు, అధికార యంత్రాంగంతో సమీక్ష.

వచ్చే నాలుగేళ్లలో చేపట్టే కార్యక్రమాలపై అమరావతిలో సీఎం సమీక్ష.

ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించాం. అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి.

ప్రభుత్వ పని తీరు, పార్టీలో ప్రతి ఒక్కరి పని తీరుపై సర్వేలు చేయిస్తున్నా.

బాగా పని చేసిన వారికి ప్రోత్సాహం. పార్టీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఎవరినైనా వదులుకుంటా.

– సీఎం చంద్రబాబు

మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పని చేయాలి.

ప్రజలకు , కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి.. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలి పోకూడదనేది నా ఆలోచన.

ప్రజలు అన్నీ గమనిస్తారు.. జాగ్రత్తగా ఉండాలి.. గత ప్రభుత్వంలో రాష్ట్రమంతా నిరాశ, నిస్పృహ, చీకటి అలముకుంది.

భయంకర పరిస్థితులను రాష్ట్ర ప్రజలు చూశారు.. రాష్ట్రం పేరు వింటేనే దగ్గరకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు.

ఆర్థికంగా రాష్ట్రాన్ని అసమర్థ పాలనతో పాతాళానికి తొక్కేశారు.. మనం తీసుకునే నిర్ణయాలతోనే మంచి ఫలితాలు వస్తున్నాయి.

గత ప్రభుత్వాన్ని భరించలేకే ప్రజలు ఏకపక్షంగా మనల్ని గెలిపించారు.

ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పని తీరుపై సర్వేలు, నివేదికలు.

మంచి చేస్తే అభినందిస్తా.. తప్పు చేస్తే దూరం పెడతా.. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తా.

– సీఎం చంద్రబాబు

 

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..