వాట్సప్ ద్వారా నోటీసుల జారీ వద్దు – సుప్రీం కోర్టు

    Date:

    📰 Generate e-Paper Clip

    అక్షర ఉదయమ్ – ఢిల్లీ: వాట్సాప్ ద్వారా లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ మార్గంలో కానీ పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు ఈ నెల 21న స్పష్టం చేసింది. 1973 నాటి Crpc 41ఏ సెక్షన్ లేదా 2023 నాటి భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 35వ సెక్షన్ నిర్దేశించిన పద్ధతిలో మాత్రమే నోటీసులు పంపాలని పేర్కొంది. ఈ మేరకు పోలీసులకు ఉత్తర్వు జారీచేయాలని అన్ని రాష్ట్రాలూ, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. 1973 నాటి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద పోలీసులు వాట్సప్ లో నోటీసులు జారీచేయగా, నిందితులు దర్యాప్తు అధికారి ముందు హాజరుకాని సందర్భాలు ఉన్నాయని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుపాను – ఏపీలో అత్యంత భారీ వర్షాలు

    దూసుకొస్తున్న ‘అర్నబ్' తుపాను    ఏపీలో అత్యంత భారీ వర్షాలు     అక్షర ఉదయమ్ -...

    పోలింగుకు ముందే కూటమి సత్తా – పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం

    పోలింగుకు ముందే కూటమి సత్తా  పలు మున్సిపాలిటీలు ఏకగ్రీవం   అక్షర ఉదయమ్ -...

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం

    పిడుగురాళ్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ టీడీపీ కైవసం అయింది....