తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది.

అదే నెల 27న పోలింగ్ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది.

“అక్షర ఉదయమ్” న్యూస్