గుంటూరులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

📰 Generate e-Paper Clip

అక్షర ఉదయమ్ – గుంటూరు

11కేవీ విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో
శనివారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల
వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముస్తాక్ అహ్మద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలుపేట, సాంబశివపేట, రైల్వేస్టేషన్ రోడ్డు, పొత్తూరివారి తోట, కొత్తపేట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించాలని కోరారు.