అక్షర ఉదయమ్ – మంగళగిరి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి మంగళగిరి పరిధి ఎన్నారై వై జంక్షన్ నేతన్న సర్కిల్ వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని విచారణ చేపట్టారు. వై. జంక్షన్ వద్ద విద్యుద్దీపాలు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలని వాహనదారులు ఈ సందర్భంగా కోరుతున్నారు.