అక్షర ఉదయమ్ – వేటపాలెం

వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ పరిధిలోని విజయనగర్ కాలనీ నందు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల డిఎస్పి మహమ్మద్ మెయిన్, సీఐ శేషగిరిరావు, ఎస్సై వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి మహమ్మద్ మెయిన్ మాట్లాడుతూ ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని డిఎస్పి
సూచించారు.