పిడుగురాళ్ళ పట్టణంలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న యరపతినేని నగర్ లోని ఎస్జీయూ (STU ) భవన్ నందు ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల (గ్రాడ్యుయేట్స్) ఎమ్మెల్సీ – 2025 ఎన్నికల సందర్బంగా STU పిడుగురాళ్ళ మండల వార్షిక కౌన్సిల్ సమావేశం మరియు పిడుగురాళ్ళ ప్రాంతీయ శాఖల సమావేశంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, గురజాల శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, గురజాల నియోజకవర్గం పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి వేసి ఓటు గెలిపించాలని కోరటం జరిగింది.

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ పట్టణంలోని రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు, సభ్యులు, మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.