అక్షర ఉదయమ్ – గుత్తి

అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రమేష్ రెడ్డి, శ్రీదేవి దంపతుల కుమారుడు యూకేజీ చదువుతున్న రితక్ రెడ్డి స్కేటింగ్ లో అంతర్జాతీయ స్థాయికి ఎంపికైనట్లు స్కేటింగ్ మాస్టర్ రాజశేఖర్ మంగళవారం చెప్పారు. మధురైలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 తేదీ వరకు జాతీయస్థాయి స్కేటింగ్ పోటీలు జరిగాయి ఆ పోటీలో రితిక్ రెడ్డి ప్రతిభ కనబరిచాడు. దీంతో నిర్వాహకులు రితాగ్ రెడ్డిని అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక చేశారు.