జగన్ 2.0 వస్తుంది

జగన్ 2.0 వస్తుంది

– అప్పుడు మామూలుగా ఉండదు

– వైఎస్సార్ సీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు

 


అక్షర ఉదయమ్ – తాడేపల్లి

మళ్లీ వచ్చేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జగన్ 2.0లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాడేపల్లిలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసు పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వల్లభనేని వంశీ, నందిగం సురేష్ విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కార్యకర్తలను వేధిస్తున్న వారికి సినిమా చూపిస్తామని రిటైర్డ్ అయినా విదేశాలకు వెళ్ళిపోయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రప్పిస్తామని జగన్ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజల తరఫున బలమైన పోరాటాలు చేస్తామని, వచ్చేది వైసిపి ప్రభుత్వమేనని, మంచి రోజులు వస్తాయని జగన్ వ్యాఖ్యానించారు.

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..