మంత్రి నారాయణతో చర్చించి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే యరపతినేని

అక్షర ఉదయమ్ – అమరావతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణని గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యరపతినేని తన గురజాల నియోజక వర్గంలోని పట్టణాల అభివృద్ధి గురించి చర్చించి, నిధులను కోరగా, సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగూరు నారాయణ పిడుగురాళ్ళ మున్సిపాలిటీలో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. అదే విధంగా గురజాల మున్సిపాలిటీలో సుంకర కుంట చెరువు పూడిక తీత, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు, వాకింగ్ ట్రాక్ చుట్టూ లైటింగ్, సుందరీకరణకు 2 కోట్ల రూపాయలు, గురజాల మున్సిపాలిటీ పరిధిలోని “మాచర్ల – గుంటూరు రోడ్డు”లో రోడ్డుకి ఇరువైపులా మెయిన్ డ్రైన్స్ల అవుట్ ఫాల్ డ్రైన్స్ నిర్మాణం కోసం 3 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. అభివృద్ధి పనులకు నిధులను అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించి, నిధులను మంజూరు చేసిన మంత్రి పొంగూరు నారాయణకి గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..