తిరుపతి లో దొంగను పట్టించిన LHMS కెమెరా
వీడియో: తిరుపతి పోలీస్
వేసవి కాలంలో సెలవులకు ఊర్లు కాని, విహార యాత్రలకు వెళ్ళుతున్న సమయంలో పోలీసు వారు ఉచితంగా నిర్వహిస్తున్న LHMS కెమెరా సేవలు వినియోగించుకొవాలంటూ జిల్లా ఎస్పి గారి ఆదేశాలతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన తిరుపతి జిల్లా పోలీసు సిబ్బంది.
తిరుపతి పోలీసు సిబ్బంది సోషల్ మీడియాలో ఇచ్చిన ప్రచారం తో ప్రజలలో వచ్చిన స్పందన.
గొల్లవానిగుంటలో ఓ కుటుంబం ఊరెళ్తూ పోలీసు వారిని సంప్రదింగా ఇంటి లోపల LHMS కెమెరాను అమర్చడం జరిగినది.
దొంగ చోరికి యత్నిస్తున్న సమయంలో తిరుపతి పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ లో అల్లారం సౌండ్ రావడం తో వేంటనే స్థానికంగా ఉన్న అలిపిరి పోలీసు సిబ్బంది కి సమాచారం ఇవ్వడం జరిగింది.
వేంటనే స్పందించిన అలిపిరి పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని దొంగను పట్టుకోవడం జరిగింది.
పోలీసు వారు ఉచితంగా అమర్చిన LHMS కెమెరాతో దొంగతనం జరగకుండా నివారించామని పోలీసు సిబ్బంది అంటున్నారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సమాచారం వచ్చిన వేంటనే దొంగను పట్టుకున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పి గారు అభినందించారు.
తిరుపతి జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు వేసవికాలం సెలవులలో ఊర్లుకు వెళ్ళిన, విహార యాత్రకు వెళ్ళిన పోలీసు వారికి సమాచారం ఇస్తే LHMS కెమెరా అమర్చి మీ ఇంటికి మేము రక్షణ గా ఉంటామని జిల్లా ఎస్పీ గారు అన్నారు.