కాకినాడ జిల్లా సముద్ర తీరం వెంబడి డ్రోన్స్ తో పటిష్టమైన నిఘా: కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్

కాకినాడ జిల్లా సముద్ర తీరం వెంబడి డ్రోన్స్ తో పటిష్టమైన నిఘా- కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్.

కాకినాడ పోర్ట్ ప్రాంతము, NTR బీచ్, లైట్ హౌస్ ప్రాంతము, జిల్లా తూర్పు సముద్ర తీర ప్రాంతం వెంబడి డ్రోన్స్ తో నిఘా, పటిష్టమైన భద్రత మరియు రక్షణ ఏర్పాటు కొరకు డ్రోన్స్ వినియోగిస్తున్నామని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్, ఐపీఎస్., తెలిపారు.

పగలు, రాత్రి డ్రోన్స్ తో స్థానిక పోలీసులు మరియు మెరైన్ పోలీసులు కోస్ట్ గార్డ్ పోలీసుల పహారాతో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, అపరిచిత వ్యక్తులను గుర్తించడం కోసం ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు తెలిపారు.

కాకినాడ జిల్లా తొండంగి, U. కొత్తపల్లి, తిమ్మాపురం, సర్పవరం, కాకినాడ పోర్ట్ మరియు కోరింగ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు, అనుమానాస్పద బోట్లు సమాచారం ఉంటే తక్షణమే దగ్గరలోని పోలీసులకు తెలియజేయవలసినదిగా కోరినారు. ఈ గస్తీ, పగలు రాత్రి కూడా కొనసాగుతుందని తెలియజేశారు.