నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని

నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో గురువారం “పిడుగురాళ్ళ నుంచి విజయవాడ” సర్వీస్ నూతన ఎక్స్ ప్రెస్ బస్సును గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. అదే విధంగా “పిడుగురాళ్ళ నుంచి పిన్నెల్లి” పల్లె వెలుగు సర్వీసును ఎమ్మెల్యే యరపతినేని పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ ఆర్టీసీ డిపో మేనేజర్, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.