పిడుగురాళ్ళలో వైభవంగా శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ ఉత్సవం

– అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ 

 

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణం జానపాడు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అధికారికఃగా ప్రకటించబడిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

తొలుత ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఆలయం కమిటీ, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున అమ్మ వారికి గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ మున్సిపల్ ఛైర్మన్ సుబ్బారావు, ఆలయ పాలకవర్గ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.