వైభవంగా మార్కాపురంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవ ఉత్సవం

అక్షర ఉదయమ్ – మార్కాపురం 

మార్కాపురంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుండడంతో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

 

 

ఆలయం అర్చకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మహిళలు లక్ష లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణం నిర్వహించారు.