చీరాల ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో నవోదయం కార్యక్రమం

అక్షర ఉదయమ్ – చీరాల

 

జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు జనార్ధన రావు, విజయల ఆధ్వర్యంలో బుధవారం సారా తయారీ స్థావరమైన రామ్ నగర్ లో నవోదయం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సారా వల్ల కలిగే అనారోగ్యం, ఇతర దుష్పరిణామాలను వివరించారు. అంతేకాక సారా తయారీ, అమ్మకాలు, కొనుగోలు చేసేవారికి చట్టపరంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు. సారా జోలికి పోమంటూ వారి చేత ప్రతిజ్ఞలు చేయించారు. ఎక్సైజ్ సీఐ పేరం నాగేశ్వరరావు పాల్గొన్నారు.