
అక్షర ఉదయమ్ – మేదరమెట్ల
బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ఎస్సై మహమ్మద్ రఫీ పర్యవేక్షించారు. మహిళా దినోత్సవం నాడు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరుగుతుందని ఎస్సై మహమ్మద్ రఫీ చెప్పారు.