– స్పష్టం చేసిన ఎస్సైలు మోహన్, శివ నాగరాజు
– వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ 
పిడుగురాళ్ళ పట్టణంలోకి రావాలంటే ఇకపై నో హెల్మెట్.. నో ఎంట్రీ.. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రమాదాలను నివారించేందుకు పిడుగురాళ్ళ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు ఇకపై పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోకి రావాలంటే హెల్మెట్ తప్పనిసరి అని పిడుగురాళ్ళ పట్టణ ఎస్ఐ శివ నాగరాజు, ఎస్ఐ మోహన్ “అక్షర ఉదయమ్” ప్రతినిధికి తెలియజేశారు.

హెల్మెట్ తప్పనిసరిగా ఎందుకు ధరించాలి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా అడ్డుకుంటుంది అనే విషయాన్ని వివరిస్తూ.. వాహనదారులను చైతన్యవంతులను చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బైపాస్ సర్కిల్ వద్ద ఎస్సైలు శివ నాగరాజు, మోహన్ తమ సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు.