పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు

అక్షర ఉదయమ్ – రొంపిచర్ల
ఈ రోజు రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులను, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఎస్పి శ్రీ కంచి శ్రీనివాసరావు గారు.
రొంపిచర్ల పోలీస్ స్టేషన్ రిసెప్షన్ నందు వచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ ను తనిఖీ చేసినారు.

లాకప్ మరియు స్టేషన్ పరిసరాలు తనిఖీ చేశారు. అనుమతి లేకుండా లాకప్ నందు ఎవరిని ఉంచవద్దని శ్రీ ఎస్పీ గారు స్టేషన్ అధికారులకు తెలిపారు.
అదేవిధంగా దర్యాప్తులో ఉన్న కేసులలో సత్వరమే బాధితులకు న్యాయం చేయాలని, స్టేషన్ అధికారులకు తగిన సూచనలు చేశారు.
అదేవిధంగా రిసెప్షన్ లో ఉన్నటువంటి సిబ్బంది పనితీరును మరియు వారు చేస్తున్నటువంటి విధులకు సంబంధించి ఏ విధంగా చేయుచున్నారో వారిని అడగడం జరిగింది.
రాత్రి గస్తీకు వెళ్లే సిబ్బందితో మాట్లాడి గస్తీ ముమ్మరం గా జరిగేటట్లు చూడవలసిందిగా స్టేషన్ అధికారులకు తెలియజేశారు. అక్రమ మద్యం, అక్రమ ఇసుక, గంజాయి మొదలైన నిషేధిత పదార్థాల అక్రమ రవాణా, నిల్వలు పై దృష్టి సారించాలని సూచించారు.
దొంగతనాల నియంత్రణ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని,
విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ మహిళలపై జరుగుతున్న నేరాల అరికట్టడంపై దృష్టి పెట్టి, వాటిని అరికట్టాలనీ, తెలిపారు.
అంతేకాకుండా సైబర్ నేరాల పై, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఫోక్సో నేరాలపై విస్తృతంగా అవగాహన కలిగించాలని ప్రత్యేకంగా ఆదేశించినారు.
పోలీస్ అధికారులు మరియు సిబ్బంది యొక్క యోగక్షేమాల విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందే వ్యవస్థకు వెన్నెముక అని తెలియజేసారు.
ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ గారితో పాటు యస్.బి సిఐ బండారు సురేష్ బాబు గారు, రొంపిచర్ల ఎస్ఐ మని కృష్ణ గారు, నరసరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ గారు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..