
అక్షర ఉదయమ్ – గుంటూరు
గుంటూరు నగరంలో డ్రోన్ కెమెరాలతో గస్తీ, ట్రాఫిక్ నిబంధనల అమలు పై నిరంతర పోలీస్ నిఘా
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ విలాస్ సెంటర్ మరియు ఫ్లై ఓవర్, లాడ్జి సెంటర్, సాయి బాబా రోడ్డు మొదలగు ప్రాంతాల్లో డ్రోన్ గస్తీ నిర్వహించి ఆయా ప్రదేశాల్లో వాహనాల కదలికలు మరియు పార్కింగ్ సరళిని పరిశీలించడం జరిగింది.

గుంటూరు నగరంలో ఇక నుండి నిరంతరం డ్రోన్ కెమెరాలతో గస్తీ నిర్వహించడం జరుగుతుందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేగంగా వెళ్లే వాహనం యొక్క నెంబర్ ప్లేట్ ని కూడా కనిపెట్ట గలిగే సామర్థ్యంతో ఉన్న డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తూ ఈ డ్రోన్ గస్తీ నిర్వహిస్తున్నామని వెస్ట్ ట్రాఫిక్ సీఐ గారు తెలిపారు.

అతివేగం మరియు ప్రమాదకరంగా వాహనాలు నడపడం, ట్రిపుల్ రైడింగ్, రేసింగ్ చేయడం వంటి చర్యలను కట్టడి చేసే దిశగా ఈ డ్రోన్ గస్తీ నిర్వహిస్తున్నామని, ఎవరైనా పైన పేర్కొన్న విధంగా చేస్తే డ్రోన్ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా వారి పై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నట్లు వెస్ట్ ట్రాఫిక్ సీఐ గారు తెలిపారు.