
అక్షర ఉదయమ్ – పెనుకొండ
కియ కార్లను రవాణా చేసేందుకు శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును కియ ప్రతినిధులు, రైల్వే అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. కియ పరిశ్రమ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎస్‌యూవీ కార్లను తరలించడానికి డబుల్ డెక్కర్ గూడ్స్ రైలును ప్రారంభించామని తెలిపారు. ఈ డబుల్ డెక్కర్ గూడ్స్ రైలులో ఒక్కసారి 264 కార్లను తరలించగలమని తెలిపారు.
