ఎలాంటి విపత్కర పరిస్థితినైనా భద్రతాపరంగా సమర్ధంగా ఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది: జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా ఐఏయస్ మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర,ఐపీఎస్.,గార్లు

పోలీసులు భద్రతాపరంగా డ్రిల్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
సంఘ విద్రోహ చర్యలను నిర్వీర్యం చేయుట, సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షణ, పౌరులకు భద్రతా భావాన్ని కల్పించే చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా ఐఏయస్ మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర, ఐపీఎస్., గార్లు పర్యవేక్షణలో బుధవారం ఒంగోలు రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ మరియు జిల్లా పలు ప్రదేశాలలో అగ్ని పేలుడు, ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఎక్సప్లోజిప్స్ అనుమానాస్పదమైన బ్యాగు ఉంచి ఆ ప్రదేశంలో దాన్ని గుర్తించి చేపట్టాల్సిన భద్రతా చర్యలు, సైరన్లు మోగినప్పుడు తక్షణమే ఏమి చేయాలి రక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై స్పెషల్ పార్టీ పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఫైర్, హెల్త్ సిబ్బంది వెంటనే చేపట్టే చర్యలు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు భద్రతా పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆ ప్రదేశానికి ఎవరిని వెళ్లకుండా పౌరులు బాధ్యతగా వ్యవహరించటం గురించి, పోలీసులు చేసే విధివిధానాలు గురించి క్షుణ్ణంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.

రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ లో అనుమానాస్పదంగా బ్యాగు ఉన్నట్లు వచ్చిన సమాచారంపై వెంటనే పోలీసులు బీడీ టీం,స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు డాగ్స్ స్క్వాడ్ తో సంఘటన ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. స్పెషల్ పార్టీ, బీటీ టీం సిబ్బంది రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ చుట్టుపక్కల క్షుణ్ణంగా పరిశీలించి అనుమానస్పద బ్యాగ్ ను గుర్తించారు. ఆ బ్యాగులో పేలుడు పదార్థాలు ఉన్నట్లుగా స్నాపర్ డాగ్ గుర్తించింది. ప్రజలు ఆ ప్రదేశానికి ఎవరిని వెళ్లకుండా క్యూ మేనేజర్ ఏర్పాటు చేసినారు. పోలీసు సిబ్బంది బాంబు డిస్పోజల్ సూట్ ధరించి ఆ ఎక్స్ప్లోజివ్ నిర్వీర్యం చేశారు.

అనంతరం కలెక్టరు గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కీలకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్న 244 జిల్లాలను భద్రతాపరంగా ప్రత్యేకంగా గుర్తించి మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిoదన్నారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాను ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. అయితే కీలక ప్రభుత్వ సంస్థలు ఉన్న ఆన్ని ప్రదేశాలలోనూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశించినందున ఒంగోలు రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్ లలో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు చెప్పారు. నిజంగా ఉపద్రవం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి? వివిధ శాఖల సన్నద్ధత – సమన్వయలోపాలను తెలుసుకోవడం, ఇలాంటి సమయాలలో ఎలా వ్యవహరించాలో ప్రజలకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా సమర్ధంగా ఎదుర్కొంటామని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ సింధూర ఆపరేషన్ నేపథ్యంలో ఎక్సప్లోజిప్స్ అనుమానాస్పదమైన బ్యాగు, ఉగ్రవాదులు దాడులు చేపడితే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించమని, ఏదైనా ప్రదేశంలో సంఘ విద్రోహశక్తులు దాడులు చేస్తే అన్ని శాఖలు సంయుక్తంగా విధులు నిర్వహించి ప్రాణ నష్టం, ఆస్థి నష్టం లేకుండా తీసుకోవలసిన చర్యలు, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు ఏవిధంగా అప్రమత్తంగా వ్యవహరించాలనే విషయాల గురించి పౌరులకు అవగాహన కల్పించమన్నారు. రైల్వే స్టేషన్, బస్సు స్టాండ్ లతో పాటు టంగుటూరు పరిసర ప్రాంతాలలో పెట్రోలియం సంస్థలు, కేంద్ర,రాష్ట్ర ఆస్తులు కూడా ఉన్నందున వాటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దన్నారు. ప్రాణ నష్టం జరుగకుండా ప్రజలలో అవగాహన కల్పించేందుకే ఇలాంటి మాక్ డ్రిల్ నిర్వహించామన్నారు.

ఈ డెమో డ్రిల్ ద్వారా భవిష్యత్తులో సంభవించే అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమైనా అనుమానస్పదంగా బ్యాగులు, వ్యక్తులు మరియు ఇతర వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 సమాచారం అందించాలని పోలీస్ అధికారులు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామిరెడ్డి, ఏఆర్ ఎస్సైలు, ఇతర శాఖల అధికారులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
