గుంటూరులో రోడ్, డ్రైన్ ఆక్రమణలను ఈ నెల 11వ తేదీ తొలిగింపు

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

గుంటూరు నగరంలోని శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు ప్రారంభ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ప్రజా సౌకర్యార్ధం హిందూ కాలేజి జంక్షన్ నుండి నగరంపాలెం, పట్టాభిపురం మెయిన్ రోడ్, స్తంభాలగరువు ద్వారా గుజ్జనగుండ్ల వరకు రోడ్, డ్రైన్ ఆక్రమణలను ఈ నెల 11వ తేదీ (మంగళవారం) నుండి తొలగింపు చేపడతామని, ఆక్రమణదారులు 10వ తేదీలోపు స్వచ్చందంగా తొలగించుకొని జిఎంసికి సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో కోరారు.