మంత్రి లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసిన “యరపతినేని”

మంత్రి లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసిన “యరపతినేని”

 

 

అక్షర ఉదయమ్ – ఉండవల్లి

 

 

అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం గురువారం మధ్యాహ్నం గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఐటి, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురజాల నియోజక వర్గ అభివృద్ధి, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. నియోజక వర్గ అభివృద్ధికి 9 నెలల్లో చేపట్టిన పనులను యరపతినేని లోకేష్ కు వివరించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ చేస్తున్న సేవా కార్యక్రమాలు గురించి సవివరంగా యరపతినేని తెలియజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ గురజాలలో జరిగిన యువగళం పాదయాత్ర జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గం అభివృద్ధికి సహకరించాలని యరపతినేని లోకేష్ ను కోరారు. గురజాల ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటు వేశారని, వారి ఆకాంక్షలు నెరవేర్చేలా నియోజక వర్గం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

 

ఈ సమావేశంలో ఎమ్మెల్యే యరపతినేని తనయుడు, యువ నాయకులు యరపతినేని నిఖిల్ కూడా పాల్గొన్నారు. నిఖిల్ ను ఆప్యాయంగా పలకరించిన లోకేష్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలని కోరారు.