
అక్షర ఉదయమ్ – రాజమండ్రి
రైల్వే బడ్జెట్లో ఏపీకి రికార్డు స్థాయిలో
కేటాయింపులు చేయడం అభినందనీయమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోమవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి రూ. 271.43 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో రానున్న పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా జీ+భవనం, ప్లేట్ ఫారంల విస్తరణ, కొత్తగా ఏడు లిఫ్టులు, 300 కార్లు పార్కింగ్ చేసుకునేలా స్టేషన్ను సుందరికరిస్తామన్నారు.