సమస్యలు పరిష్కరించుకునే శక్తి మనకు ఉంది
ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి
ఓం క్యాప్ ద్వారా విదేశాల్లో ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు!
ప్రైవేటు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ అసోసియేషన్ల ప్రతినిధుల సమావేశంలో మంత్రి నారా లోకేష్

అక్షర ఉదయమ్ – ఉండవల్లి
చరిత్ర సృష్టించాలంటే పోరాడాలని, ఐదేళ్లలో విద్యా వ్యవస్థలో మార్పులకు అందరి సహకారం కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ప్రైవేటు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్, అన్ ఎయిడెడ్ కాలేజీల అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మీరందరూ రాబోయే తరాలను తయారు చేస్తున్నారు. ప్రపంచంలో వేగంగా జనాభా తగ్గిపోతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టంతా భారతదేశం వైపే ఉంది. ఓం క్యాప్ ద్వారా ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో స్కిల్డ్ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా దాదాపు 150 మందికి అమెరికాలో ఉద్యోగ అవకాశాలు లభించాయి. యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా ఓం క్యాప్ ద్వారా శిక్షణ అందిస్తాం. కాలేజీలను ఇండస్ట్రీస్ తో లింకేజీ చేయాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు సిద్ధంగా ఉన్నాం. మన సమస్యలు మనమే పరిష్కరించుకుందా. ఎవరైనా తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడించవచ్చు. సమస్యలు పరిష్కరించే శక్తి మనకిచ్చారు. కాలేజీలకు అఫ్లియేషన్ల విషయంలో సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు.

ప్రైవేటు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్, అన్ ఎయిడెడ్ కాలేజీల అసోసియేషన్ల ప్రతినిధులు తమ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇంటర్ కాలేజీలకు అఫ్లియేషన్ జారీలో సమస్యలు ఉన్నాయని, నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగానే ఇంటర్ విద్యార్థులకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కాలేజీ ట్రాన్స్ ఫర్ విషయంలో అపరాధ రుసుముల భారాన్ని తగ్గించాలి. జూనియర్ కాలేజీల విషయంలో బోర్డు కమిటీలో ప్రైవేటు జూనియర్ కాలేజీల అసోసియేషన్ నుంచి ఒకరికి స్థానం కల్పించాలని కోరారు. ప్రైవేటు అన్ ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి అతి తక్కవ జీతాలు అందుతున్నాయని, వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటుచేసి ఆదుకోవాలని కోరారు. ఇండస్ట్రీస్ తో ఐటీఐలను లింకేజీ చేయాలి. ప్రభుత్వ విభాగాల్లో అప్రెంటిషిఫ్ ను అమలు చేయడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పాలిటెక్నిక్ సిలబస్, పరీక్షా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్ ఓకేషనల్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్ బాబు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, వేపాడ చిరంజీవితో పాటు ప్రైవేటు ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఒకేషనల్, అన్ ఎయిడెడ్ కాలేజీల అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.