అక్షర ఉదయమ్ – తెనాలి

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున తెనాలి డివిజన్ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ సంజన సింహా శనివారం తెలిపారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ నెల 3, 10, 17, 24 తేదీలతో పాటు మార్చి 3వ తేదీ సోమవారాల్లో జరగాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని చెప్పారు కావున ప్రజలు సహకరించాలని కోరారు.