పట్టభద్రులను కలవనున్న నిఖిల్
అక్షర ఉదయమ్ – పల్నాడు

గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యరపతినేని నిఖిల్ నేడు గురజాల నియోజక వర్గ పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లను కలవనున్నారు.
యరపతినేని నిఖిల్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
– మధ్యాహ్నం 2 గంటలకు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్లో పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులను కలుస్తారు.
– 2:30 గంటలకు పిడుగురాళ్ళ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలోని కస్తూర్బా పాఠశాలకు విచ్చేసి పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులను కలుస్తారు.
– మధ్యాహ్నం 3 గంటలకు పిడుగురాళ్ళ మండలం, జానపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులను కలుస్తారు.
– సాయంత్రం 5 గంటలకు దాచేపల్లి పట్టణంలో పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఇంటింటి ప్రచారంలో భాగంగా దాచేపల్లి పట్టణంలోని పట్టభద్రులను (ఎమ్మెల్సీ ఓటర్లను) కలుస్తారు.