పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యరపతినేని

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు గురువారం పంపిణీ చేశారు. పిడుగురాళ్ళ పట్టణంలోని 11వ వార్డుకు చెందిన వివిధ రకాల పింఛను దారులకు యరపతినేని పింఛన్లను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు, పిడుగురాళ్ళ పట్టణంలో వివిధ హోదాల్లోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.